Graduate Engineer Trainee (GET) Program

The Graduate Engineer Trainee Program at Reliance aims to hand pick young, high-potential engineering talent across India and nurture them to take on key technical roles across Reliance.

1. Registration
Register yourself to start the application process

11th Jan, 2024 - 19th Jan, 2024

2. Assessment
Shortlisted students will go through the online assessment (Cognitive Test + Subject Matter)

5th Feb, 2024 - 8th Feb, 2024

3. Interviews
Further shortlisted candidates will go through a personal interview round

23rd Feb, 2024 - 1st Mar, 2024

4. Final Selection
Students will receive a final update on their candidature

By End of Mar, 2024
Graduate Engineer Trainee (GET) Program
Reliance jobs: రిలయన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ విద్యార్థులకు సదవకాశం

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance jobs) ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించే కంపెనీలు కొన్ని విద్యా సంస్థలకే పరిమితమవుతున్నాయని, దీనివల్ల టాప్‌ 50 లేదా టాప్‌- 100 సంస్థల విద్యార్థులకే అవకాశాలు లభిస్తున్నాయని రిలయన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపింది. గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ (GET) 2024 పేరిట ప్రారంభించిన ఈ డ్రైవ్‌లో భాగంగా జనవరి 11 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

బీటెక్‌, బీఈ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యా సంస్థల నుంచి కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్‌ చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారిని ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

రిలయన్స్‌ అందిస్తున్న ఈ సదావకాశాన్ని ఇంజినీరింగ్‌ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను (https://relianceget2024.in/) సైతం రిలయన్స్ అందుబాటులో ఉంచింది. అందులో అర్హత, నియామక ప్రక్రియ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ వివరాలను అందులో పొందుపరిచింది. అభ్యర్థులు 10, 12, డిప్లొమాలో 60 శాతం మార్కులు లేదా 6 CGPA సాధించి ఉండాలి. ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఏడో సెమిస్టర్‌/గ్రాడ్యుయేషన్‌) మార్కులు సాధించిన వారు అర్హులు.


Those who want different types of job notifications join this WhatsApp channel:


Telegram Channel for Job Notifications:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top