Govt of AP Directorate of Employment Training http://employment.ap.gov.in/ఉపాధి కల్పనకు సరికొత్త వెబ్‌సైట్‌


Govt of AP Directorate of Employment Training   http://employment.ap.gov.in/ Eployement Exchange Regisration Website ఉపాధి కల్పనకు సరికొత్త వెబ్‌సైట్‌

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసిందని ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌ అన్నారు.గురువారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలోని జేసీ చాంబర్‌లో ఆన్‌లైన్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజ్‌ వెబ్‌ పోర్టల్‌ను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల్లో ఉపాధి అవకాశాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకునే విధంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారన్నారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా అనేక ప్రాంతాలలో ఖాళీగా ఉండే ఉద్యోగ వివరాలను పొందుపరిచారన్నారు. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు వారి అర్హతను బట్టి కావాల్సిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం సులభతరమవుతుందన్నారు

ఉద్యోగావకాశాలు..

అనంతరం జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు మాట్లాడుతూ గతంలో స్థానిక ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిరుద్యోగ యువత వివరాల నమోదు జరిగేదని, తద్వారా సీనియారిటీ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేసేవారన్నారు. ఈ పోర్టల్‌లో ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయి తమ విద్యార్హతల వివరాలను నమోదు చేయగానే మొబైల్‌లో సందేశం వస్తుందన్నారు. ఆ వెంటనే వివరాలు అయా జిల్లా స్థాయి అధికారికి చేరి వారి ఆమోదంతో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వస్తుందన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌, అదనపు అర్హతల నమోదు తదితర సేవలు వెబ్‌ పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధి అధికారి వై.సత్య బ్రహ్మం (ఒకేషనల్‌ గైడెన్స్‌), ఎస్‌.జయరాజు పాల్గొన్నారు

Those who want different types of job notifications join this WhatsApp channel:


Telegram Channel for Job Notifications:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top