చీపురుపల పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగులకు డిసెంబర్ 27 ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డా.పీవీ కృష్ణాజీ డిసెంబర్ 24న ఒక ప్రకటనలో తెలిపారుడిసెంబర్ 27న ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్ మేళాకు హైదరాబాద్కు చెందిన అరబిందో ఫార్మా, ఎంఎస్ఎస్ ల్యాబ్స్, న్యూ ల్యాండ్ ల్యాబొరేటరీస్ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు
ఈ ఉద్యోగమేళాకు హాజరు కాదలచిన అభ్యర్థులు బీఫార్మా, బీఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్, ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత కలిగి కనీసం 26 సంవత్సరాలు ఉండాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆర్బీఎస్ఎస్ అండ్ ఎఫ్ఎన్దాస్ పరిశ్రమ సీఎస్ఆర్ నిధుల ద్వారా విశాఖపట్నంలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగావకాశాల్లో భాగంగా నెలకు రూ.12,500 నుంచి రూ.20,000 వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు 8688156216, 86880880562 నంబర్లకు సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment