IB ACIO Recruitment 2023: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ 2/ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
అభ్యర్థులు కేంద్ర హోం శాఖ అధికారిక వెబ్సైట్ mha.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 226 పోస్ట్ లు..
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ 2/ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు డిసెంబర్ 23వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 12, 2024. అలాగే, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 16, 2024.
Vacancy Details: ఖాళీల వివరాలు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 79 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 147 పోస్టులు
Eligibility: అర్హతలు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాల/సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల/ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ తో సైన్స్ లేదా ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ; లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (గేట్ కోడ్: ఈసీ) లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గేట్ కోడ్: సీఎస్)లో గేట్ 2021 లేదా గేట్ 2022 లేదా గేట్ 2023లో అర్హత కటాఫ్ మార్కులు సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయోపరిమితి 2024 జనవరి 12 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
Selection Process: ఎంపిక విధానం
గేట్ 2021 లేదా గేట్ 2022 లేదా గేట్ 2023 లలో క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను (ఖాళీల సంఖ్యకు 10 రెట్లు) షార్ట్ లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. సంబంధిత రంగాల్లో సబ్జెక్టు పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే రెండు పారామీటర్ల ఆధారంగా అభ్యర్థి లక్షణాలను అంచనా వేయడం ఈ ఇంటర్వ్యూ లక్ష్యం. గేట్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో అభ్యర్థుల ఉమ్మడి మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
Examination Fees: పరీక్ష ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా అదనంగా రూ. 100 చెల్లించాలి. డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎస్బీఐ చలానా మొదలైన వాటి ద్వారా ఈ ఫీజును చెల్లించవచ్చు.
Nice information
ReplyDelete