Visakhapatnam - BEL : విశాఖపట్నంలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. బెల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 57
ట్రైనీ ఇంజినీర్-1: 45 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 12 పోస్టులు
ముఖ్యసమాచారం :
అర్హత: 55% మార్కులతో బీఎస్సీ(ఇంజినీరింగ్)/ బీఈ, బీటెక్(సీఎస్‌ఈ/ ఐఎస్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.02.2023 నాటికి ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ట్రెయినీ ఇంజినీర్ ఖాళీలకు రూ.30,000-రూ.40,000.. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు రూ.40,000-రూ.55,000 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు రూ.177.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.472 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 27, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bel-india.in/
Download Complete Notification
0 comments:
Post a Comment