ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలే ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 3వ తేదీన.. మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు తమ కంపినిలలో ఉద్యోగస్థులను ఎంపిక చేసుకునేందుకి పాల్గొనున్నాయి. CTEC PVT లిమిటెడ్,అస్త్రో స్టీల్స్,NS ఇన్స్ట్రుమెంట్స్,మిథుబాషా, అమర్ రాజా బ్యాటరిస్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.దీనికోసం పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు
0 comments:
Post a Comment