స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. స్థానిక భాషలోనూ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
వివరాలు..
➥ క్లర్క్ పోస్టులు..
అర్హత: ఏదైనా డిగ్రీ.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం:
ప్రిలిమినరీ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2023, నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్-40 ప్రశ్నలు-40 మార్కులు(35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు (45 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు (45 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
మెయిన్ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2024, జనవరిలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్-40 ప్రశ్నలు-40 మార్కులు(35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు (45 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు (45 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
0 comments:
Post a Comment