BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు 
వివరాలు..

* మొత్తం ఖాళీలు: 100

➥ క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-II): 50 పోస్టులు 

➥ క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-III): 50 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ(ఫుల్‌టైం),బ్యాంకింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఫారెక్స్, క్రెడిట్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, సీఏ,సీఎఫ్‌ఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 30.09.2023 నాటికి క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-II) పోస్టులకు 25-32 సంవత్సరాలు, క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-III) పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.118 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

రాతపరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రొఫెషనల్ నాలెజ్డ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ బ్యాంకింగ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

పరీక్ష కేంద్రాలు: పాట్నా, ఛండీఘడ్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పనాజీ, అహ్మదాబాద్, రాంచీ, భోపాల్, ఔరంగబాద్, ముంబయి, నాగ్‌పూర్, పుణె, జైపూర్, లక్నో, కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, చెన్నై, హైదారాబాద్, బెంగళూరు, తిరువనంతపురం.

జీతభత్యాలు: క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-II) పోస్టులకు రూ.48,170-రూ.69,810; క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-III) పోస్టులకు రూ.63,840-రూ.78,230 చెల్లిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 23.10.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.11.2023.

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top