ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎలాంటి రాత పరీక్ష లేకుండా SSC ఆఫీసర్ పోస్టుల భర్తీ జరుగుతోంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 224 కాగా ఇందులో
జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్: 40 పోస్టులు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 8 పోస్టులు
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 18 పోస్టులు
లాజిస్టిక్స్: 20 పోస్టులు
పైలెట్ 20 పోస్టులు
ఎడ్యుకేషన్: 18 పోస్టులు
ఇంజినీరింగ్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 30 పోస్టులు
ఎలక్ట్రికల్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 50 పోస్టులు
నావల్ కన్‌స్ట్రక్టర్: 20 పోస్టులు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే.. బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలని పేర్కొన్నారు. రాత పరీక్ష లేకుండా మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన వాళ్లకు ప్రారంభ వేతనం నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ సంప్రదించవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 29 చివరి తేదీగా నిర్ణయించారు.
0 comments:
Post a Comment