Job Alert: గవర్నమెంట్‌ జాబ్స్‌.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారో లేదో చెక్‌ చేసుకోండి..

ఇండియాలో ఎక్కువ మంది ప్రైవేట్‌ జాబ్స్‌లో స్థిరపడుతుంటారు. అధిక శాలరీలు, ఫ్లెక్సిబిలిటీ కోరుకునే వాళ్లు ఆ రంగంలో అడుగుపెడతారు. అయితే ఇంకొంత మంది కెరీర్‌ స్థిరంగా, సెక్యూర్‌గా ఉండాలని ఆలోచిస్తారు. ఎన్నేళ్లైనా గవర్నమెంట్‌ జాబ్‌ కావాలని ప్రయత్నిస్తుంటారు. మీరూ ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఇండియన్ నేవీ, ఎన్‌టీపీసీ, ఎయిమ్స్, ఈఎస్‌ఐసీ వంటి సంస్థలు వివిధ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ జారీ చేశాయి. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఇండియన్ నేవీ

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ (అక్టోబర్ 8) ప్రారంభమైంది. ఈ గడువు అక్టోబర్ 29న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇండియన్ నేవీ 224 ఖాళీలను భర్తీ చేస్తుంది.


ఎన్‌టీపీసీ


నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPS) లిమిటెడ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు అక్టోబరు 20న ముగుస్తుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2023లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎన్‌టీపీసీ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 495 ఖాళీలను భర్తీ చేస్తుంది.

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్క చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు..


ఖాళీల వివరాలు:

1. సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్: 362 పోస్టులు

2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్): 315 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 677.

అర్హతలు: ఎంటీఎస్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత. ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్తో ఏడాడి పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700 - రూ. 69,100. ఎంటీఎస్ ఖాళీలకు రూ.18,000 - .56,900.

ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్) ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ (ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు మాత్రమే), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్,

దరఖాస్తు రుసుము రూ.500.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 14.10.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023. 

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 16.11.2023.


ఈఎస్‌ఐసీ

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) గ్రూప్- సి కింద పారామెడికల్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తంగా 1,038 ఖాళీలను దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భర్తీ చేస్తుంది. దరఖాస్తుదారులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి.



Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top