BHEL: బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు

 బెంగ‌ళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 11


కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.



➥ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 04 


అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.


➥ ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్స్‌:  07


అర్హత: 60 శాతం మార్కులతో డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.10.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


దరఖాస్తు ఫీజు: రూ.200.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతభత్యాలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు నెలకు రూ.46,130 చెల్లిస్తారు. ఇతర భత్యాలు కూడా అందుతాయి.


దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా:

AGM (HR), 

Bharat Heavy Electricals Limited, 

Electronics Division, P. B. No. 2606, 

Mysore Road, Bengaluru-560026.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023.


➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 04.11.2023.


➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది (దూరప్రాంతాల వారికి): 07.11.2023.


Complete Notification

Online Application

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top