ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అర్హులైన అభ్యర్థుల నుంచి అప్రెంటిస్ జాబ్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com. ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్ట్ లు, అర్హత..
ఐఓసీఎల్ (IOCL) లో మొత్తం 1720 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు iocl.com. వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అక్టోబర్ 21వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 20వ తేదీతో ముగుస్తుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్ స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇంటర్మీడియట్ (Class XII) / గ్రాడ్యుయేట్/డిప్లోమా పూర్తి చేసినవారు అర్హులు. ఆయా అర్హత పరీక్షలో వారు కనీసం 50% మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారు కనీసం 45% మార్కులు సాధించాలి.
వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో మినహాయింపులు ఉంటాయి. ఐఓసీఎల్ లో అప్రెంటిస్ పోస్ట్ లకు రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు IOCL అధికారిక వెబ్ సైట్ iocl.com. ను పరిశీలించాలి.
0 comments:
Post a Comment