దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-2, జులై 2023) ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మూడో జాబితాను తపాలా శాఖ తాజాగా విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1058 పోస్టులు ఉండగా, తెలంగాణలో 961 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 30లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తపాలా శాఖ సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అందించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ. పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుతుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.,
0 comments:
Post a Comment