ఎచ్చెర్ల క్యాంపస్: స్థానిక జిల్లా సాంకేతిక శిక్షణ కేంద్రంలోని
స్కిల్ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణకు నిరుద్యోగ యువత నుంచి
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పీబీ సాయిశ్రీనివాస్ చెప్పారు. స్కిల్ కాలేజ్లో మంగళవారం వివరాలు వెల్లడించారు.
డిగ్రీ, పీజీ పూర్తిచేసిన యువత అర్హులు కాగా, ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని, 25 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు. పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్ కోర్సు (మూడు నెలలు)కు అర్హత డిగ్రీ కాగా, 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సువారు అర్హులని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటు, భోజన, వసతులు ఉచితంగా కల్పించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు 8247656581, 7680945357 సంప్రదించాలని సూచించారు.
0 comments:
Post a Comment