సిటీ యూనియన్ బ్యాంక్ వివిధ రాష్ట్రాల్లోని శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హతతోపాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. అభ్యర్థులు అక్టోబరు 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ బ్రాంచ్ మేనేజర్ (స్కేల్ I, II, III)
➥ డిప్యూటీ మేనేజర్ (స్కేల్ I, II, III)
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. జేఏఐఐబీ/ సీఏఐఐబీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం
అనుభవం: కనీసం 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ అసిస్టెంట్ మేనేజర్
➥ బ్రాంచి డెవలప్‌మెంట్ మేనేజర్
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.10.2023.
0 comments:
Post a Comment