నేవల్ షిప్ రిపేర్ యార్డ్ (కార్వార్,కర్ణాటక), నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్ (గోవా) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 210 అప్రింటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య 210
➥ నేవల్ షిప్ రిపేర్ యార్డ్: 180 పోస్టులు
➥ నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్: 30 పోస్టులు
ట్రేడ్లు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఐటీ & కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్/ఐటీ & ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ రిఫ్రిజిరేట్ & ఏసీ, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్కర్, సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్, వెల్డర్, రిగ్గర్.
అర్హత: కనీసం 50 శాతం మార్కుతో పదోతరగతి, 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి. రిగ్గర్ పోస్టులకు 8వ తరగతి అర్హత సరిపోతుంది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, కంటిచూపు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 15.04.2024 నాటికి 14-21 సంవత్సరాల మధ్య ఉండాలి. 14.04.2010 - 15.04.2023 మధ్య జన్మించి jఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా.
స్టైపెండ్: రిగ్గర్ (ఫ్రెషర్) పోస్టులకు రూ.2500, రూ.5000, రూ.5500 ఇస్తారు. ఏడాది ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారికి రూ.7700, రెండేళ్ల ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారికి రూ.8050 స్టైపెండ్‌గా ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ఉద్యోగ ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పత్రికలో ప్రచురితమైననాటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తులు సమర్పించాలి
Download Complete Notification
0 comments:
Post a Comment