APSCSCL Tirupati Job Notification : తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL), జిల్లా కార్యాలయం.. తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ తదితర పోస్టులున్నాయి. అభ్యర్థులను అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాల్లోకెళ్తే..
1. టెక్నికల్ అసిస్టెంట్
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థలను అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జీటీ రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://tirupati.ap.gov.in/
Subscribe My Whatsapp & Telegram Groups
Nice Notification
ReplyDelete