ఫోరెన్సిక్ సైన్స్ లో డిగ్రీ,పీజీ అడ్మిషన్లు..AIFSET-2024 నోటిఫికేషన్ రిలీజ్

ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (AIFSET-2023) ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 35 పార్టిసిపేటింగ్‌ యూనివర్సిటీల్లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సుల్లో ఫీల్డ్ సైన్స్, ల్యాబొరేటరీ డేటా సైన్స్, మెడికల్ డేటా సైన్స్ విభాగాలు ఉంటాయి. అక్టోబరు 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రోగ్రామ్ వివరాలు:

1. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్
కోర్సు వ్యవధి: మూడేళ్లు
అర్హత: హయ్యర్ సెకండరీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్‌) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి

2. ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్

కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం 45 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

సబ్జెక్టులు: ట్రాన్స్‌పోర్ట్‌ ఫినోమినా, కెమికల్ ఇంజినీరింగ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ థర్మోడైనమిక్స్, కెమికల్ రియాక్టర్ ఇంజినీరింగ్, డిజైన్ తదితరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.2000

దేశవ్యాప్తంగా పాల్గొంటున్న యూనివర్సిటీలు:

తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ, మేరీమాతా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, ఆదిత్య డిగ్రీ కాలేజ్,వివేకానంద గ్లోబల్ విశ్వవిద్యాలయం, మోదీ యూనివర్సిటీ (రాజస్థాన్), మంగలయతన్ యూనివర్సిటీ (అలీఘర్), మంగలయతన్ యూనివర్సిటీ(రాంచీ),ఎంఏటీఎస్‌ విశ్వవిద్యాలయం (రాయ్‌పూర్), బహ్రా విశ్వవిద్యాలయం (షిమ్లా హిల్స్), ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం (బరేలీ), ఆర్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (బెంగళూరు), సంస్కృతి యూనివర్సిటీ (యూపీ), రయత్-బహ్రా యూనివర్సిటీ (మొహాలి), జీహెచ్ రాయ్‌సోని యూనివర్సిటీ, వేంకటేళ్వర ఓపెన్ యూనివర్సిటీ, రెనైసెన్స్ యూనివర్సిటీ (మధ్యప్రదేశ్), అపెక్స్ యూనివర్సిటీ (రాజస్థాన్), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఏకలవ్య యూనివర్సిటీ, మేడి-క్యాప్స్ యూనివర్సిటీ, పారుల్ యూనివర్సిటీ, సేజ్ యూనివర్సిటీ(భోపాల్), సేజ్ యూనివర్సిటీ (ఇండోర్), ఉషా మార్టిన్ యూనివర్సిటీ, ఓం స్టెర్లింగ్ గ్లోబల్ యూనివర్సిటీ, దేవ్-భూమి యూనివర్సిటీ, ఐటీఎం యూనివర్సిటీ (మధ్యప్రదేశ్), హిమాలయన్ యూనివర్సిటీ (అరుణాచల్ ప్రదేశ్), గీతా యూనివర్సిటీ (పానిపట్), ఏపీ గోయల్ షిమ్లా యూనివర్సిటీ, డాల్ఫిన్ కాలేజ్(పంజాబ్), అస్సామ్ డౌన్ టౌన్ యూనివర్సిటీ, అన్నై ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, సిక్కిం ప్రొఫెషనల్ యూనివర్సిటీ.

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 28-10-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 29-10-2023.

పరీక్ష ఫలితాల వెల్లడి: 31-10-2023.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top