Anganwadi jobs : ఆంధ్రప్రదేశ్- నరసరావుపేట జిల్లాలోని శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల ఖాళీల భర్తీని నోటిఫికేషన్ విడుదల జరిగిందని సమగ్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ(ఐసీడీఎస్) పీడీ బి.అరుణ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు 13 కాగా.. ఆయా పోస్టులు 74 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.నరసరావుపేటలో డివిజన్ల వారీగా పోస్టుల విషయానికొస్తే..
డివిజన్ వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. నరసరావుపేట డివిజన్‌లో మూడు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు- 41 సహాయకుల పోస్టులు, గురజాల డివిజన్‌లో ఆరు కార్యకర్తల పోస్టులు, సహాయకుల పోస్టులు- 13, సత్తెనపల్లి డివిజన్‌లో నాలుగు కార్యకర్తల పోస్టులు, ఆయా పోస్టులు- 20 ఉన్నాయన్నారు. అర్హులైన వారు అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సమీపంలోని గ్రామ సచివాలయాలు, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు
Job Notification Whatsapp Channel:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notification Telegram Channel:
0 comments:
Post a Comment