రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్టిమ్ కరస్పాండెంట్ల (పీటీసీ) నియామకాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, విజయవాడ-అమరావతి (క్యాపిటల్ ఆర్ఎన్ఎయ్య) కు గానూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
గ్రాడ్యుయేషన్ పూర్తయి న్యూస్ రిపోర్టింగ్లో రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు (24-45 సం॥లు), ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో లేక హెడ్ క్వార్టర్స్ నుండి పది కిలోమీటర్లు లోపు నివసిస్తున్నవారు, ప్రసార భారతి వెబ్ సైట్ https://prasarbharati.gov.in/pbvacancies లో జారీ చేసిన నోటీసు నుండి వివరాలు తెలుసుకుని దరఖాస్తును "Head of office, Akashvani, MG Road, Vijayawada- 520 002" చిరునామాకు అక్టోబర్ 30, 2023 లోపు పంపించగలరు. దరఖాస్తు కవర్పై పీటీసీ అప్లికేషన్ అని రాయగలరు.
దరఖాస్తు విధానం
వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను హెడ్ ఆఫ్ ఆఫీస్, ఆకాశవాణి, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.
మరింత సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నెంబరుకు వాట్సాప్ లేదా ఫోన్ చేయవచ్చు :
9440674057 (సోమవారం నుండి శనివారం ఉ॥ 9.30 గం||ల నుంచి సా॥ 6.00గం||ల వరకు)
0 comments:
Post a Comment