SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. క్రెడిట్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌లకు దరఖాస్తులు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి. ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన 3 క్రెడిట్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)/ ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీఎం (ఫైనాన్స్‌)తో పాటు కార్పొరేట్‌ ఫైనాన్స్‌/ కార్పొరేట్‌ క్రెడిట్‌ రంగంలో కనీసం అయిదేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

రెగ్యూలర్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సీ కేటగిరీ కింద 01, ఓబీసీ కేటగిరీ కింద 01, జనరల్ కేటగిరీ కింద 01 పోస్టు భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 03 పోస్టులను భర్తీ చేస్తారు.దరఖాస్తు రుసుము..

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ఇలా..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఈ రెండింటి ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు.. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఆగస్టు 29, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://sbi.co.in/web/careers/current-openings సందర్శించండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top