జాబ్ మార్కెట్‌లో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ బాగా ఉంది. భవిష్యత్‌లో మరింత పెరగనుంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి విద్యార్థులు కూడా ఏఐ, డేటా సైన్స్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేట్‌సైన్స్‌పై రెండేళ్ల ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యే అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రాబర్ట్ బాష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఏఐ (RBCDSAI)లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.40,000 స్టైఫండ్ కూడా లభిస్తుంది.
అర్హత ప్రమాణాలు
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. బలమైన అకడమిక్ ట్రాక్ రికార్డ్ తప్పనిసరి. ఫుల్‌టైమ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అవైలబులిటీ, ఆఫర్‌ను తక్షణమే అంగీకరించడం, ఆఫర్ లెటర్‌ను స్వీకరించిన ఆరు వారాలలోపు చేరే తేదీ వంటి అంశాలపై ముందస్తుగా సమాచారం అందించాల్సి ఉంటుంది. మెంటర్‌షిప్ కోసం ముగ్గురు RBCDSAI ఫ్యాకల్టీ సభ్యుల ఎంపిక చేసుకుని, అవసరమైన వివరాలతో గూగుల్ ఫారమ్ ద్వారా అప్లికేషన్స్ సమర్పించాలి. మరిన్ని వివరాలకు ఐఐటీ మద్రాస్ పోర్టల్ విజిట్ చేయండి.ఎథికల్ ప్రాక్టీస్‌లో బాగా ప్రావీణ్యం సాధించిన, బాధ్యతాయుతమైన AI ప్రాక్టీషనర్స్‌లా అభ్యర్థులను తీర్చిదిద్దడంపై ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఫోకస్ చేస్తుంది. ఏఐ అండ్ డేటా సైన్స్‌పై అభ్యర్థుల పరిశోధనా స్కిల్స్‌ను పదును పెట్టడానికి, వినూత్న పరిష్కారాలను డెవలప్ చేయడానికి అవసరమైన ప్రోత్సాహక వాతావరణం ఈ ప్రోగ్రామ్ ద్వారా కల్పించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీసెస్ పట్ల తమ నిబద్ధతను తెలియజేయడం, తద్వారా భవిష్యత్ కెరీర్ కోసం అభ్యర్థులను సిద్ధం చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.ప్రసిద్ధ సంస్థలతో కొలాబ్రేషన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌పై ఫెలోషిప్ ప్రోగ్రామ్ అకడమిక్ ఎక్స్‌పోజర్‌కు మించి దృష్టిసారిస్తుంది. గూగుల్, నాసా, సీఎంయు, ఎంఐటీ, వాల్‌మార్ట్, జేహెచ్‌యూ, హార్వర్డ్, కేఎంసీ వంటి ప్రసిద్ధ కంపెనీలతో పాటు 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామ్‌కు తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయి.
టాప్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు
ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వారికి, ఐఐటీ మద్రాస్‌కు చెందిన హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్, హై-ప్రొఫైల్ ఫ్యాకల్టీ నుంచి మెంటర్‌షిప్ యాక్సెస్ లభిస్తుంది. కోర్సు క్రెడిట్‌లను సంపాదించే అవకాశాన్ని పొందుతారు. అంతేకాకుండా టాప్ జర్నల్స్‌లో తమ రీసెర్చ్‌లను పబ్లిష్ చేసుకోవచ్చు. ప్రముఖ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, ETH జ్యూరిచ్, UC శాన్ డియాగో జాకబ్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు
0 comments:
Post a Comment