AP స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 8న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది.ఈ జాబ్ మేళా ద్వారా Flipkart, Sri Ranga Motors Pvt Ltd, FINO Payments Bank సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Sri Ranga Motors Pvt Ltd:ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12000-15000 వరకు వేతనం చెల్లించనున్నారు. పలాసా, రాజం, పాలకొండ, శ్రీకాకుళంలో పని చేయాల్సి ఉంటుంది.
FINO Payments Bank:ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.18000-రూ.25000 వరకు వేతనం ఉంటుంది.
Flipkart:ఈ సంస్థలో 103 ఖాళీలు ఉన్నాయి. డెలివరీ బాయ్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు శ్రీకాకుళంలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.
Contact
S.Surya Narayana - 9704960160
T.Rambabu - 6301275511
APSSDC Helpline - 9988853335
0 comments:
Post a Comment