AP స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 22న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ జాబ్ మేళాను కడపలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంటి. ఖాళీల వివరాలు:
Muthoot Finance:ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. Internship/ట్రైనీ అసోసియేట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ తదితర విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు వైఎస్ఆర్ జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాలతో పాటు ఏపీ, తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్థితుల ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. ట్రైనీ అసోసియేట్ గా ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది. వయస్సు 20-30 ఏళ్లు ఉండాలి.
Big Basket:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటులంది. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.18 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.
Publishing House (MGI Technologies):ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. డేటా కలెక్షన్&అసోసియేట్ ఎడిటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంఎస్సీ (BZC, BSC, MPC) అర్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12,500-రూ.14000 వేల వరకు వేతనం ఉంటుంది.
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 22న ఉదయం 9 గంటలకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, ఓ బ్లాక్, కలక్టరేట్, కడప జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇతర వివరాలకు 9908808914 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment