Northern Railway Recruitment : న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్తర్న్ రైల్వే లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మొత్తం 93 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి సివిల్-60, ఎలక్ట్రికల్-20, సిగ్నల్ & టెలికాం-13 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 20 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజుకు సంబంధించి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించి గేట్ స్కోర్ (2019- 2023 మధ్య) ఆధారంగా, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.32,000 నుంచి రూ.37,000 చెల్లిస్తారు. అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nr.indianrailways.gov.in/ పరిశీలించగలరు.
0 comments:
Post a Comment