ప్రభుత్వ ఐటీఐలో మేధా సర్వో గ్రూపు ఆఫ్ కంపెనీస్ (హైదరాబాద్) ఈనెల 11న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసాచారి తెలిపారు.
ఐటీఐ పాసైన విద్యార్థులు, కొత్తగా రిలీవ్ అయినవారు మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేళాకు వచ్చే విద్యార్థులు విధిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జెరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో హాజరు కావాలన్నారు. వెల్డర్ 25, ఎలక్ట్రీషియన్ 300, ఫిట్టర్ 300, ఎలక్ట్రానిక్ మెకానిక్ 100 ట్రేడ్లలో ఉత్తీర్ణులైన 25 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు మాత్రమే మేళాకు అర్హులని ప్రిన్సిపాల్ తెలిపారు.
0 comments:
Post a Comment