ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5 అంగన్‌వాడీ కేంద్రాల్లో సహాయకుల పోస్టుల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కాకినాడ రూరల్ ఐసీడీఎస్ సీడీపీవో వై.లక్ష్మి ఓ ప్రకటనలో కోరారు
కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిఽదిలోని కాకినాడ రూరల్ మండలంలో 3 అంగన్‌వాడీ సహాయకులు, కరప మండలంలో 2 పో స్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి గడువు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల వరకు ఉందన్నారు. ఈ పోస్టు కోసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1 జూలై 2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు వయో పరిమితిగా ఉందన్నారు.
కాకినాడ రూరల్ మండ లం సూర్యారావుపేటలో (సెంటర్ కోడ్ నెంబర్ 0420183), సహాయకురాలు పోస్టు, బీసీ -ఏ రిజర్వు అయిందన్నారు. తూరంగి-3 (0420230) సహాయకురాలు, ఎస్టీ, పండూ రు-3 (0420149) ఓసీ జనరల్), కరప-2 (0422142) సహాయకురాలు, ఓసీ జనరల్, పెనుగుదురు0-2 సహాయకురాలు ఎస్సీకి రిజర్వు చేశారన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో గల ఐసీడీఎస్ కార్యాలయంలో అందజేయాలని ఆమె కోరారు.
0 comments:
Post a Comment