ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు రాత పరీక్ష ఆగస్టు 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్లు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచామని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లు ఆగస్టు 18వ తేదీ లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సూచించారు. ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు కొన్ని సాంకేతిక కారణాల రిత్య సర్విస్ కమిషన్ వెబ్‌సైట్‌కు అంతరాయం ఏర్పడుతుందని.. ఈలోపు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ వివరించారు.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రాత పరీక్షను ఆగస్టు 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో తెల్పింది. ఈ పరీక్ష హాల్ టికెట్లను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆగస్టు 21వ తేదీన మధ్యాహ్నం, ఆగస్టు 22వ తేదీన ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టులకు ఆగస్టు 18వ తేదీన నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆగస్టు18న ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ వివరించారు.
 
 Subscribe My Whatsapp & Telegram Groups
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment