ఇండియన్ ఆర్మీలో (Indian Army) చేరాలని భావిస్తున్నారా? అయితే.. మీకు శుభవార్త. ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES)లో 41000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో వివిధ పోస్టుల్లో 41822 ఖాళీలు (Jobs) ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న సీట్లలో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రస్తుతానికి మాత్రమే ఖాళీ గురించి సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది. దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీ మరియు ఎంపిక ప్రక్రియతో సహా ఇతర ముఖ్యమైన సమాచారం త్వరలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ (Indian Army Jobs Notification) త్వరలో జారీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
ఇండియన్ మిలిటరీ సర్వీస్ (ఎంఈఎస్)లో సూపర్‌వైజర్, డ్రాట్స్‌మన్, స్టోర్ కీపర్ వంటి పోస్టులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ త్వరలో ప్రారంభించనున్నారు. పోస్టులు మరియు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు:
S.No. పోస్టు ఖాళీలు
1. ఆర్కిటెక్ట్ కేడర్ గ్రూప్ 44
2. బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ 120
3. సూపర్‌వైజర్ (బ్యారాక్ & స్టోర్) 534
4. డ్రాట్స్‌మ్యాన్ 944
5. స్టోర్ కీపర్ 2026
6. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ 11316
7. మేట్ (MATE) 27920
మొత్తం: 41822
MES రిక్రూట్‌మెంట్ ప్రక్రియ:
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం.. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఎవరు పరీక్షను నిర్వహిస్తారు?
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ జారీ చేసిన సంక్షిప్త నోటిఫికేషన్ ప్రకారం.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే SSC లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా జరుగుతుంది.
MESలో రిక్రూట్‌మెంట్‌కు అర్హత
MESలో చేరడానికి 10వ/12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అర్హతకు సంబంధించిన అదనపు సమాచారం పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటుంది.
మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే ఏమిటి?
మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క ఇంజనీర్స్ కార్ప్స్‌లో ప్రధాన భాగం. ఇది భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ మరియు నిర్వహణ ఏజెన్సీలలో ఒకటి. ఇది వ్యూహాత్మక మరియు ఆపరేషన్ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఇది దేశంలోని పురాతన రక్షణ మౌలిక సదుపాయాల-అభివృద్ధి ఏజెన్సీలలో ఒకటి.
0 comments:
Post a Comment