Scholarships: మీరు స్టూడెంటా? ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేశారో? లేదో? చెక్ చేసుకోండి

Scholarships: కోరుకున్న జీవితం పొందాలంటే చదువు చాలా ముఖ్యం. ఈ రోజుల్లో విద్య సామాన్యులకు అందుబాటులో లేని అంశంగా మారింది. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతమైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్(Scholarships), ఫెలోషిప్స్ వరంలా మారాయి. ఎడ్యుకేషన్‌లో తమ కలలను సాకారం చేసుకోవడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. కెరీర్ బిల్డప్‌లో ఆర్థికంగా తోడ్పాటునందిస్తాయి. ఆగస్టు- సెప్టెంబర్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* లెగ్రాండ్ ఎంపవరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24

దేశవ్యాప్తంగా బీటెక్, బీఈ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బీబీఏ, బీకామ్, బీఎఎస్సీ మ్యాథ్స్ అండ్ సైన్సెస్ వంటి కోర్సుల్లో అడ్మిషన్స్ పొందిన మెరిట్ గ్లర్స్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యను కొనసాగించేలా అభ్యర్థులకు ఆర్థికంగా తోడ్పాటునందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.దరఖాస్తుదారులు 2022-2023లో ఇంటర్ క్లియర్ చేసి ఉండాలి. పదో తరగతి, ఇంటర్‌లో 70% కంటే ఎక్కువ స్కోర్ చేసి ఉండాలి. విభిన్న సామర్థ్యం ఉన్న బాలిక విద్యార్థులు, లింగమార్పిడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయం తప్పనిసరిగా రూ.5,00,000 కంటే తక్కువగా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న బాలిక విద్యార్థులు www.b4s.in/it/LFL5 అనే లింక్ ద్వారా ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు అకడమిక్ పర్ఫామెన్స్ ఆధారంగా కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి రూ.60,000 వరకు 60% కోర్సు ఫీజు స్కాలర్‌షిప్ రూపంలో అందనుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు అకడమిక్ పర్ఫామెన్స్ ఆధారంగా కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి INR 1,00,000 వరకు 80% ఫీజు చెల్లించనున్నారు. వికలాంగ విద్యార్థులు, లింగమార్పిడి విద్యార్థులు, ఒంటరి తల్లి లేదా తండ్రి ఉన్న విద్యార్థులు, కోవిడ్ కారణంగా పేరెంట్స్‌ను కోల్పోయిన విద్యార్థులు స్పెషల్ కేటగిరీ కిందకు వస్తారు

రోల్స్-రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ ఫర్ ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్

ఏఐసీటీసీ గుర్తింపు పొందిన సంస్థల్లో ఇంజనీరింగ్ మొదటి, రెండు, మూడో సంవత్సరం చదువుతున్న మహిళా అభ్యర్థులు రోల్స్-రాయిస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ప్రమాణాలు

ఇంజనీరింగ్‌లో ఏరోస్పేస్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వంటి కోర్సుల్లో మొదటి, రెండు, మూడో సంవత్సరం చదువుతున్న మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పది, 12 తరగతుల్లో 60 శాతం పైగా స్కోర్ చేసి ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 4 లక్షల్లోపు ఉండాలి. శారీరక వైకల్యం, ఒంటరి తల్లి లేదా తండ్రి, అనాథ వంటి ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. గతంలో ఈ స్కాలర్‌షిప్ అందుకుని ప్రస్తుతం ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు www.b4s.in/it/UNS5 అనే లింక్ ద్వారా ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు రూ.35వేల స్కాలర్‌షిప్‌తో పాటు ఇండస్ట్రీ ఎక్స్‌ఫర్ట్స్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ వన్-టూవన్, వన్ టూ మెనీ మెంటర్‌షిప్ సెషన్స్, వెబినార్స్, వర్క్‌షాప్స్ వంటి సౌకర్యాలను రోల్స్-రాయిస్ కల్పించనుంది.

స్కాఫ్లర్ ఇండియా సోషల్ ఇన్నోవేటర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్-2023

సమాజాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే సామర్థ్యం ఉండి, స్థిరంగా పరిష్కార మార్గాలను డెవలప్ చేసే అభ్యర్థులు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత ప్రమాణాలు

సెప్టెంబర్ 1 2023 నాటికి అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుదారులు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఫంక్షనింగ్ ప్రోటోటైప్‌లతో కూడిన ప్రారంభ దశ స్టార్టప్స్, ఎన్‌జీవోస్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన అర్హతలు ఉంటే www.b4s.in/it/SIA2 అనే యూఆర్‌ఎల్ లింక్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో సెప్టెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు CIIE.CO, ఐఐఎం అహ్మదాబాద్ ప్రత్యేకమైన మెంటర్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలతో పాటు రూ.10 లక్షల విలువైన ఫెలోషిప్ గ్రాంట్స్ లభిస్తుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top