నిరుద్యోగుల పాలిట కేంద్ర ప్రభుత్వం వరంగా మారింది.. యువతకు వరాల జల్లు కురిపిస్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రకటనలను చేస్తుంది..
ఇటీవల ఎన్నో శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా కేంద్ర సాయుధ దళాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌లతోపాటు ఢిల్లీ పోలీస్ విభాగం లో 1876 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. విభాగాల వారిగా పోస్టులకు సంబంధించి సీఆర్‌పీఎఫ్ 818, బీఎస్‌ఎఫ్ 113, ఐటీబీపీ 63, సీఐఎస్‌ఎఫ్ 630, ఎస్‌ఎస్‌బీ 90 ఖాళీలు ఉండగా దిల్లీ పోలీస్‌కు సంబంధించి పురుషులకు 109, మహిళలకు 53 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.. ఆన్‌లైన్ పరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసు లో సడలింపు ఉంది.. ఎస్ ఐ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజుగా రూ.100 నిర్ణయించారు మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదిగా ఆగస్టు 15, 2023 ను నిర్ణయించారు.. వీటి గురించి మరింత సమాచారన్ని తెలుసుకోవడం కోసం వెబ్‌సైట్:https://ssc.nic.in/ పరిశీలించగలరు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వారు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
0 comments:
Post a Comment