ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4545 క్లర్క్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనుంది. అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
0 comments:
Post a Comment