ఎయిమ్స్‌ మంగళగిరిలో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు

AIIMS Mangalagiri Recruitment: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.


వివరాలు..

మొత్తం ఖాళీలు: 70

* గ్రూప్-బి పోస్టులు

సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్-1): 58

పీఏ టు ప్రిన్సిపాల్: 01

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01

మెడికల్ సోషల్ వర్కర్: 01

అసిస్టెంట్(ఎన్‌ఎస్‌): 01

పర్సనల్ అసిస్టెంట్: 01

లైబ్రేరియన్ గ్రేడ్-3: 01

* గ్రూప్-సి పోస్టులు

ల్యాబ్ టెక్నీషియన్: 02 

అప్పర్ డివిజనల్ క్లర్క్: 02 

ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2: 02

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమతి: పోస్టుని అనుసరించి 18-35 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకురూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.08.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Complete Notification

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top