Coal India Limited Recruitment 2023 : కోల్ ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ అండ్ సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 7 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 09 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 1764
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులున్నాయి.
విభాగాలు : ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 7 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 09, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://coalindia.in/
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment