నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఇస్రో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.టెక్నీషియన్ 'బి'/డ్రాఫ్ట్స్మెన్ 'బి' పోస్టుల కోసం ఈ దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ isro.gov.in ని సందర్శించి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21 చివరి తేదీ. అంటే ఈ ఉద్యోగాలకు మరో వారంలో దరఖాస్తుల గడువు ముగియనుంది.
ఇకపోతే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 34 ఖాళీలు టెక్నీషియన్ 'బి', ఒక ఖాళీ డ్రాఫ్ట్స్మన్ 'బి' పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ఇది. ఇక ఈ ఉద్యోగాలకు అర్హతల విషయానికొస్తే పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేవారు.. https://www.isro.gov.in/ వెబ్ సైట్ లో సందర్శించవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top