ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల (APPSC Group-1, Group-2 Jobs) భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 లో 89, గ్రూప్-2 కు సంబంధించి 508 ఖాళీల (Jobs) భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. గ్రూప్-1 కు సంబంధించి హోం శాఖలో అత్యధికంగా 27 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డీఎస్పీకి సంబంధించి 25, డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ జైల్స్-01, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్-1 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 44 ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖలో 8 ఖాళీలు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 01 ఖాళీ ఉంది. ఇంకా గ్రూప్-2 విషయానికి వస్తే.. ఇంకా గ్రూప్-2 ఖాళీల విషయానికి వస్తే అత్యంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 161 ఉన్నాయి. ఇంకా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 150, డిప్యూటీ తహసీల్దార్ 114, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18, సబ్ రిజిస్ట్రార్ 16, మున్సిపల్ కమిషనర్ పోస్టుల విభాగంలో 04 ఖాళీలు ఉన్నాయి.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ (APPSC) నుంచి త్వరలోనే విడుదల కానున్నాయి. ఏపీలో ఇటీవల గ్రూప్-1 నియమాలను ఏపీపీఎస్సీ విజయవంతంగా ముగించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఏపీ సీఎం జగన్ సైతం గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా లెక్కలను తేల్చాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ రోజు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి అనుమతులు మంజూరు చేశారు. వచ్చే నెలలో ఏపీపీఎస్సీ నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment