BEL Jobs 2023 : బీటెక్ అర్హతతో​ కేంద్ర ప్రభుత్వ కొలువులు.. లక్షల్లో జీతం.. అప్లై చేసుకోండిలా!

BEL Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువు సంపాదించాలని కలలు కనేవారికి గుడ్​న్యూస్​. ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్​లో 95 పోస్టులు ​, నాల్కోలో 36 పోస్టులు..మొత్తం 131 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్​ విడుదల అయ్యాయి. మరి అవి ఏం పోస్టులు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? జీతభత్యాలు ఎలా ఉంటాయి? దరఖాస్తు చివరితేదీ ఎప్పుడు? తదితర వివరాలు మీకోసం.

BEL Jobs 2023 : ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) 95 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) 36 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

బెల్‌-ఘజియాబాద్‌లో 95 వివిధ పోస్టులు..!
BEL Jobs : ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో ఖాళీగా ఉన్న 95 వివిధ పోస్టుల( BEL Recruitment 2023 )ను భార్తీ చేసేందుకు అర్హుల నుంచి ఆగస్టు 22 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

మొత్తం ఖాళీలు..
BEL Vacancy 2023 :95 పోస్టులు.

పోస్టులు..
BEL Posts : ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ట్రెయినీ ఆఫీసర్.

విభాగాలు..
హ్యూమన్‌ రిసోర్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫైనాన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌ తదితరాలు.

విద్యార్హతలు..
BEL Qualification : ఆయాపోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. బీఈ/బీటెక్‌, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమాల్లో ఉత్తీర్ణత సాధించాలి.

పని అనుభవం..
అభ్యర్థులకు కనీసం 0-2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

ఏజ్​ లిమిట్​..

ట్రెయినీ ఇంజినీర్‌, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 32 ఏళ్లు దాటకూడదు.
జీతభత్యాలు..
BEL Salary : ట్రెయినీ ఇంజినీర్‌, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000-రూ.40,000, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.40,000-రూ.55,000ల వరకు వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం..
BEL Recruitment Selection Process : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ఫీజు..

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- రూ.400/-
ట్రెయినీ ఆఫీసర్​, ట్రెయినీ ఇంజినీర్‌- రూ.150/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది..
BEL Exam Apply Last Date : 2023 సెప్టెంబర్​ 07.

పరీక్షా తేదీ..
BEL Exam Date 2023 : సెప్టెంబర్ చివరివారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

కాలవ్యవధి..
BEL Ghaziabad Apprentice 2023 : ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు కాంట్రాక్​ పద్ధతిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా గరిష్ఠంగా ఈ వ్యవధిని మూడేళ్లకు పెంచుతారు.

వెబ్​సైట్..
BEL Website : పూర్తి వివరాల కోసం బీఈఎల్​ అధికారిక​ వెబ్​సైట్​ http://www.bel-india.inను వీక్షించవచ్చు.

నాల్కోలో 36 మేనేజర్ పోస్టులు!
NALCO Jobs 2023 : ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) మొత్తం 36 మేనేజర్​ పోస్టుల( NALCO Job Vacancy 2023 ) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు..
NALCO Recruitment 2023 : 36 పోస్టులు.

పోస్టుల వివరాలు..

డిప్యూటీ మేనేజర్- 29 పోస్టులు
సీనియర్ మేనేజర్- 02 ఖాళీలు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 05 పోస్టులు
విభాగాలు..
NALCO Job Openings : సివిల్​, హార్టికల్చర్​, పీఆర్​ అండ్​ సీసీ, సెఫ్టీ, లా, మైనింగ్, కోల్​ మైనింగ్​, బ్లాస్టింగ్ ఆఫీసర్​, సర్వే.

అర్హతలు..
NALCO Job Qualifications : సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

2023 సెప్టెంబర్​ 27 నాటికి వయో పరిమితి..

సీనియర్ మేనేజర్ - గరిష్ఠ వయస్సు 41 ఏళ్లు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు
డిప్యూటీ మేనేజర్ - 35 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్​..

డిప్యూటీ మేనేజర్​ పోస్టులకు రూ.53,100-రూ.1,67,800
సీనియర్ మేనేజర్​ పోస్టులకు నెలకు రూ.78,800-రూ.2,09,200
అసిస్టెంట్ జనరల్ మేనేజర్​ పోస్టులకు నెలకు రూ.78,800-రూ.2,09,200
ఎంపిక ప్రక్రియ..
NALCO Selection Process : గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు రుసుము..
NALCO Jobs Application Fees : అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

దరఖాస్తు విధానం..
ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..

అప్లికేషన్​లు ప్రారంభం- 2023 ఆగస్టు 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2023 సెప్టెంబర్​ 27(సాయంత్రం 5 గంటల వరకు)
వెబ్​సైట్​..
NALCO Official Website : మరిన్ని పూర్తి వివరాల కోసం నాల్కో అధికారిక వెబ్​సైట్​ https://nalcoindia.com/ ను చూడవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top