AP Jobs : ఆంధ్రప్రదేశ్‌లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూల తేదీలివే

APMSRB Recruitment 2023 : ఏపీ- మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అప్లయ్‌ చేసుకోవాల్సిన అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వివరాల్లోకెళ్తే..

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 300 పోస్టులు
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ,పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, చెస్ట్‌ డిసీజ్‌ స్పెషాలిటీల్లో ఈ పోస్టులున్నాయి.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రెగ్యులర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,37 వరకూ ఉంటుంది. కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతమైతే రూ.2,50,000.. గ్రామీణ ప్రాంతమైతే రూ.2,00,000.. పట్టణ ప్రాంతమైతే రూ.1,30,000 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ తేదీలు: సెప్టెంబర్‌ 5, 7, 9 తేదీల్లో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూలు నిర్వహించే స్థలం: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్‌, ఇ.నెం.77-21 జి, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : http://hmfw.ap.gov.in/index.aspx


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top