UPSC Recruitment 2023 : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏరోనాటికల్ ఆఫీసర్ (Aeronautical Officer), ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ (Principal Civil Hydrographic Officer), సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Senior Administrative Officer) గ్రేడ్-II, సైంటిస్ట్ బీ (Scientist B), అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ (Assistant Geophysicist) తదితర పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. ఆగస్టు 10 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాల్లోకెళ్తేమొత్తం పోస్టులు : 56
పోస్టులు : ఏరోనాటికల్ ఆఫీసర్ (Aeronautical Officer), ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ (PCHO), సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్ బీ (Scientist B), అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ (Assistant Geophysicist) తదితర పోస్టులున్నాయి.
అర్హతలు : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
జీతం : పోస్టులను బట్టి రూ. 47,600 నుంచి రూ.1,51,100 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.25 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి.
చివరి తేది: ఆగస్టు 10, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :https://www.upsc.gov.in/
0 comments:
Post a Comment