TATA STEEL : B Tech అర్హతతో టాటా స్టీల్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.7 లక్షల జీతం.. వెంటనే అప్లయ్‌ చేసుకోండి

TATA STEEL : టాటా గ్రూప్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ (TATA Steel Aspiring Engineers Program 2023) ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ (B Tech) లేదా ఎంటెక్‌/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు. వివరాల్లోకెళ్తే..
TATA Steel Aspiring Engineers Program 2023
పోస్టుల వివరాలు: ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు
విభాగాలు: సివిల్ అండ్‌ స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్‌, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, బెనిఫికేషన్ ఇంజినీర్, జియోఇన్ఫర్మేటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఎంటెక్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.06.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.
జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్‌ నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
ఇంజినీర్‌ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: జూన్‌ 11, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://tslhr.tatasteel.co.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top