Post Office: పోస్టాఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్.. రూ.5 వేల పెట్టుబడితో నెలకు రూ.80000.. ఎలా అప్లై చేసుకోవాలి?

Post Office: భారతీయ పౌరుల కోసం పోస్టాఫీసు పలు రకాల పథకాలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా స్కీమ్స్ ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలా మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, ఇలా పొదుపు పథకాలు మాత్రమే కాదు.. సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే వారికి సరికొత్త అవకాశాలను సైతం కల్పిస్తోంది. అదే ప్రోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ స్కీమ్. చాలా తక్కువ పెట్టుబడితో ఈ ఫ్రాంచైజీ ద్వారా ఆదాయాన్ని అందుకోవచ్చుఒక్కసారి రూ. 5 వేలు పెట్టుబడి పెట్టినట్లయితే పోస్టీఫీసు ఫ్రాంచైజీ తెరవొచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.56 లక్షల పోస్టాఫీసు బ్రాంచులు ఉన్నాయి. అయినప్పటికీ కొత్త అవుట్ లెట్లకు మంచి డిమాండ్ ఉంటోంది. పెరుగుతోన్న అవసరలా దృష్ట్యా రెండు రకాల ఫ్రాంచైజీలను పోస్టాఫీసు ఆఫర్ చేస్తోంది. ఒకటి ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు, రెండోది పోస్టల్ ఏజెంట్లు. ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను కౌంటర్ సర్వీసులు అందించేందుకు తెరవొచ్చు. అలాగే పోస్టల్ ఏజెంట్స్ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ వస్తువులు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.
అర్హతలు, ఆదాయం ఎలా?

పోస్టాఫీసు ఫ్రాంచైజీ ప్రారంభించాలనుకునే వారి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

భారతీయ పౌరుడు ఎవరైనా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు.

గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి.

పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు ఈ ఫ్రాంచైజీలను తెరవడానికి వీలు లేదు.

పోస్టాఫీసుకు చెందిన పలు సర్వీసులను అందిస్తూ కమీషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.3 కమీషన్ తీసుకోవచ్చు.

స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ.5 తీసుకోవచ్చు.

రూ.100 నుంచి రూ. 200 మధ్య ఉండే మనీయార్డర్లకు రూ. 3.50 కమీషన్, రూ.200 ఆపైన ఉండే వాటికి రూ.5 కమీషన్ తీసుకోవచ్చు.

రూ. 100 కంటే తక్కువ మని ఆర్డర్లు తీసుకోవడానికి లేదు.

నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్స్ చేసినట్లయితే అదనంగా 20 శాతం కమీషన్ వస్తుంది.

పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా వాటిపై 5 శాతం కమీషన్ పొందవచ్చు.

రిజిస్టర్డ్ పార్సిల్ నుంచి నెలవారీ బిజినెస్‌లకు స్పీడ్ పోస్ట్ పార్సిల్స్‌కి కమీషన్లు భిన్నంగా ఉంటాయి.

పోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ ప్రారంభించాలనుకునే వారు.. https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్లకి పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ శిక్షణ కూడా ఇస్తుంది. పాన్ షాప్, స్టేషనరీ దుకాణం, కిరాణ షాపు వంటివి ఉన్న వారు కూడా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top