LIC Part Time Jobs : ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగాలు కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆ అవకాశం కల్పిస్తోంది. పార్ట్ టైం ఏజెంట్‌గా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం 10వ తరగతి పాసై ఉంటే సరిపోతుంది. LIC కల్పిస్తున్న ఈ అవకాశం ద్వారా రోజుకు 4 గంటలు పని చేస్తే చాలు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎల్ఐసీ పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ మార్గాల్లో సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ముందుగా ఎల్ఐసీలో ఏజెంట్‌గా చేరాలి. ఆ తర్వాత ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది.
LIC ఏజెంట్‌గా ఎలా మారాలంటే..?
ఎల్‌ఐసీ ఏజెంట్ కావడానికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 18 ఏళ్లు నిండి ఉండాలి. నగరానికి సమీపంలోని LIC బ్రాంచ్‌కి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని కలవాలి. బ్రాంచ్ మేనేజర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మీరు ఈ ఉద్యోగానికి సరిపోతారని భావిస్తే శిక్షణ కోసం పంపుతారు. 25 గంటల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో మీకు జీవిత బీమా పాలసీల గురించి వివరంగా చెబుతారు. తరువాత IRDAI నిర్వహించే ప్రీ-రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీమా ఏజెంట్ అపాయింట్‌మెంట్ లెటర్, గుర్తింపు కార్డును పొందుతారు.
0 comments:
Post a Comment