ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 1న బాపట్ల జిల్లాలో మినీ జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫ్లిప్ కార్ట్, స్కిల్ క్రాఫ్ట్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Apex Software Solutions: డేటా ఎంట్రీ ఆపరేటర్స్, Jr.Auto CAD Endineer, Jr.Formating Analyst విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు గుంటూరులో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఇంకా వేతనంతో పాటు రూ.వేయి హాస్టల్ అలవెన్స్ ఉంటుంది.
Flipkart: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. డెలివరీ బాయ్స్, ఎజెంట్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారితో పాటు టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు బాపట్ల, చీరాల&ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాకి రూ.1.8 లక్షల వేతనం ఉంటుంది.
0 comments:
Post a Comment