విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 34
* అంగన్‌వాడీ వర్కర్: 02
* అంగన్‌వాడీ హెల్పర్: 32
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుంది.
జీతం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2023.
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు క్రింది లింకు నందు కలదు
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment