ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో (02/2023-నవంబర్ 23 బ్యాచ్) శిక్షణ ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్)
మొత్తం ఖాళీలు: 1365 పోస్టులు(మెన్-1120, ఉమెన్-273)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండాలి. కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: 01.11.2002 – 31.04.2005 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.550.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
శిక్షణ వివరాలు: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29.05.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15.06.2023.
➥ శిక్షణ ప్రారంభం: 2023, నవంబరులో
Job Notification Whatsapp Group:
Telegram Group:
0 comments:
Post a Comment