ఉచితంగా బీటెక్ చేస్తూ నెలకు స్టైపెండ్ రూ. 56 వేలు పొందొచ్చు! ఆపై రూ. లక్ష జీతం

ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఉచితంగా బీటెక్ చదివే అవకాశాన్ని ఇండియన్ ఆర్మీ కల్పిస్తోంది. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ కోర్సును పూర్తి చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం పొందవచ్చు. జేఈఈ మెయిన్ 2023 స్కోరుతో ఈ కోర్సుకి, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన వారిని రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఐదేళ్ల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీంకి ఎంపికైన వారికి 2024 జనవరి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.

శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి బీటెక్ డిగ్రీతో పాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం కూడా వస్తుంది. విధుల్లో చేరిన వారికి నెలకు రూ. లక్ష వేతనం ఇస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. మొదటిరోజు మొదటి దశ స్క్రీనింగ్ (ఇంటిలిజెన్స్) పరీక్షల్లో అర్హత సాధించిన వారిని రెండవ దశకి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహించి అన్ని విభాగాల్లో రాణించిన వారిని కోర్సు, శిక్షణకు తీసుకుంటారు.

కోర్సు, శిక్షణ: ఐదేళ్లు

బేసిక్ మిలటరీ ట్రైనింగ్:

ఏడాది పాటు గయలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో బేసిక్ మిలటరీ ట్రైనింగ్ ఉంటుంది. లేదా ఇండియన్ ఆర్మీ నిర్ణయించిన ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఉంటుంది.

టెక్నికల్ ట్రైనింగ్:
మొదటి దశ: (ప్రీ కమిషన్ ట్రైనింగ్)

పుణెలోని మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ (సీఎంఈ) లేదా మావ్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఎంసీటీఈ) లేదా సికింద్రాబాద్ లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో (ఎంసీఈఎంఈ) మూడేళ్ళ పాటు ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది.

రెండో దశ: (పోస్ట్ కమిషన్ ట్రైనింగ్)

పుణెలోని సీఎంఈ లేదా మావ్ లోని ఎంసీటీఈ లేదా సికింద్రాబాద్ లోని ఎంసీఈఎంఈ కాలేజ్ లో ఏడాది పాటు పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ లో పాసైన వారికి ఇంజనీరింగ్ డిగ్రీ అందుతుంది.

ఉద్యోగం:

నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి లెఫ్టినెంట్ హోదాలో జీతం అందుతుంది. ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ళ అనుభవంతో మేజర్, 13 ఏళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్, 26 ఏళ్ల అనుభవంతో కల్నల్ ఇలా ప్రమోషన్స్ పొందవచ్చు. పదవీ విరమణ వయసు వరకూ లేదా ఆసక్తి ఉన్నంత వరకూ విధుల్లో కొనసాగవచ్చు. ఇవి శాశ్వత పోస్టులు.
జీతం:
లెఫ్టినెంట్: రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకూ
డీఏ, హెచ్ఆర్ఏ, పలు అలవెన్సులు ఉంటాయి.
మిలిటరీ సర్వీస్ పే: రూ. 15,550
స్టైపెండ్:
మూడేళ్ళ శిక్షణ పూర్తి చేసిన అనంతరం నెలకు రూ. 56,100 స్టైపెండ్ అందుతుంది.
ఖాళీలు: 90
అర్హత:
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ప్లస్ 2 పూర్తి చేసి ఉండాలి.
జేఈఈ మెయిన్స్ 2023 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
పురుషులకు మాత్రమే అవకాశం.

వయసు: 16 ½ నుంచి 19 ½ ఏళ్ల మధ్య ఉండాలి. (2004 జూలై 2 నుంచి 2007 జూలై 1 మధ్య జన్మించాలి)

ఆఖరు తేదీ: జూన్ 30 2023 12 గంటల వరకూ
Job Notification Whatsappp Group:


Job Notification Telegram Group:



Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top