ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్&ఏసీ, షీట్ మెటల్ వర్కర్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 281 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఇవాళే అప్లికేషన్ గడువుకు లాస్ట్ డేట్. శిక్షణ కాలం ఒక ఏడాది పాటు ఉంటుంది.
ఖాళీలు: 281
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 24
వెబ్‌సైట్: https://apprenticedas.recttindia.in/
నేవల్ డాక్‌యార్డ్ ముంబై రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీ వివరాలు
ఒక సంవత్సరం శిక్షణ
ఫిట్టర్-42
మేసన్ (BC)-08
I&CTSM-03
ఎలక్ట్రీషియన్-38
ఎలక్ట్రానిక్స్ మెకానిక్-24
ఎలక్ట్రోప్లేటర్-01
మెకానిక్ (డీజిల్)-32
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
ప్యాటర్న్ మేకర్-02
మెకానిక్ R&AC-07
షీట్ మెటల్ వర్కర్-03
పైప్ ఫిట్టర్-12
షిప్ రైట్(వుడ్)-17
టైలర్(G)-03
వెల్డర్(G&E)-19
రెండు సంవత్సరాల శిక్షణ
రిగ్గర్-12
ఫోర్జర్ & హీట్ ట్రీటర్ -01
షిప్ రైట్(స్టీల్)-16
నావల్ డాక్‌యార్డ్ ముంబై రిక్రూట్‌మెంట్ 2023: విద్యా అర్హత
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి (అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం) 10వ పరీక్షలో కనీసం 50శాతం మార్కులతో పాటు ITI పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి (తాత్కాలిక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఆమోదయోగ్యమైనది) సంబంధిత ట్రేడ్‌లో మొత్తం 65% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
NCVT ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి సంబంధిత ITI/ ట్రేడ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అర్హతను కలిగి ఉండాలి.
రిగ్గర్ కోసం ఫ్రెషర్‌గా నమోదు చేసుకోవలసిన అభ్యర్థులకు కనీస అర్హత 8వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే, ఎల్‌ఐటిఐ లేకుండా, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ ట్రేడ్‌కు 10వ తరగతి ఉండాలి. ITI లేకుండా ఉత్తీర్ణత మాత్రమే.
0 comments:
Post a Comment