Job Mela in AP: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APSSDC ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 27న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నంద్యాలలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:
YSK Info Tech Pvt Ltd: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ వర్క్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/ఐటీఐ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం చెల్లించనున్నారు.

Honour Lab Limited: ఈ సంస్థలో 90 ఖాళీలు ఉన్నయి. ప్రొడక్షన్, జూనియర్ రీసెర్చ్/కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ/బీ.కామ్/బీఏ, ఎంఎస్సీ ఆర్గానిక్/అనలైటికల్ కెమిస్ట్రీ/బీఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.50 నుంచి రూ.2.70 లక్షల వేతనం చెల్లించనున్నారు.

Sujala Pipes: ఆపరేటర్స్ అండ్ కట్టర్ విభాగాల్లో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఐటీఐ/ఫిట్టర్/కట్టర్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల వేతనం చెల్లించనున్నారు.

Rajabags: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ కేర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top