ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీబీపీలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు దరఖాస్తుల చేయాలని ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ITBP recruitment.itbpolice.nic.in అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 27 నుండి ప్రారంభమవుతుంది. ఇది 26 జూలై 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ITBPలో మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తుంది.
ఖాళీల వివరాలిలా..
ఈ క్యాంపెయిన్ ద్వారా మొత్తం 458 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 195 యూఆర్ పోస్టులు, 74 ఎస్సీ, 37 ఎస్టీ, 110 ఓబీసీ, 42 ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. అభ్యర్థి చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయో పరిమితి
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ఇలా..
PET, PST, రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ టెస్ట్ , వివరణాత్మక వైద్య పరీక్ష / సమీక్ష వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఈ పోస్టులకు ఎంపిక చేయబడతారు
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే బ్యాంక్ నుంచి రూ. 100 చెల్లించాలి. SC, ST చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27 జూన్ 2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 26 జూలై 2023
0 comments:
Post a Comment