IIT Kharagpur Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)..
153 జూనియర్ ఎగ్జిక్యూటివ్, స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్, సెక్యూరిటీ, ఇన్‌స్పెక్టర్ (నాన్ టీచింగ్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్షలేకుండా ఆకర్షణీయ జీతంతో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా/ ఎంబీఏ లేదా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 25 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జులై 5, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూబీఎప్/మహిళా అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటెరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.21,7000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Super 😍
ReplyDelete